News September 2, 2024
రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
విశాఖ-విజయవాడ-విశాఖ రత్నాచల్ సూపర్ ఫాస్ట్‌ను 2, 3వ తేదీల్లో రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ వెల్లడించారు. గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు.. విశాఖ-గుంటూరు సింహాద్రిని 3 నుంచి 6వ తేదీ వరకు క్యాన్సిల్ చేశామన్నారు. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ను 2 నుంచి 5 వరకు, రాయగడ-గుంటూరు రైలును 3 నుంచి 6వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News January 21, 2025
అల్లూరి విగ్రహానికి నల్లరంగు..!
విశాఖలోని స్వతంత్ర నగర్ పార్కులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. సీపీఐ మధురవాడ కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సీఐ స్పందించి విచారణ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. కానిస్టేబుల్ లోవరాజు అల్లూరి విగ్రహాన్ని మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని తెలిపారు.
News January 21, 2025
స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది చంద్రబాబే: మంత్రి కొల్లు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది చంద్రబాబే అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం భూదోపిడి కోసమే స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని నడిపారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌కు ప్రధానితో శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు.
News January 21, 2025
ఎదురుకాల్పుల్లో కీలక నేతలు మృతి?
ఛత్తీస్‌ఘడ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, ఒడిశా మావోయిస్టు పార్టీ ఇన్‌ఛార్జ్ మొండెం బాలకృష్ణ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అధికారికంగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇంకా గాలింపు చర్యలు జరుగుతుండగా,మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి.