News October 15, 2025
రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం

గుంటూరు- పెదకూరపాడు స్టేషన్ల మధ్యలో రన్నింగ్ ట్రైన్‌లో మహిళ(35)పై అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాలు.. రాజమండ్రిలో ఓ మహిళ సంత్రగాచి స్పెషల్ రైలు ఎక్కారు. సోమవారం రాత్రి రైలులోని మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న ఆమెను దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. పెదకూరపాడు స్టేషన్‌లో దిగి పారిపోయాడు. బాధితురాలు మంగళవారం చర్లపల్లికి రాగానే GRP పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Similar News
News October 16, 2025
సూర్యాపేట: డీసీసీ పదవికి పోటీ..!

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ నెలకొంది. పార్టీ అధికారంలో ఉండడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ గట్టిగానే కసరత్తు చేస్తోంది. అందుకనుగుణంగా ఏఐసీసీ పరిశీలకుడు జిల్లాలోనే మకాం వేశారు. జిల్లా నుంచి ఆరుగురి పేర్లను అధిష్ఠానానికి పంపనున్నట్లు తెలుస్తోంది. డీసీసీ ఎవరికి దక్కుతుందనుకుంటున్నారు.
News October 16, 2025
HYD: భారీగా వస్తాయనుకుంటే.. బోర్లా పడేశాయి!

భారీగా వస్తాయనుకున్న మద్యం షాపుల దరఖాస్తులు ఆబ్కారీశాఖలో ఆందోళన రేపాయి. గతేడాది ఉమ్మడి రంగారెడ్డిలో 514 మద్యం షాపులకు 38,493 దరఖాస్తులు రాగా.. 3రోజుల మిగిలి ఉండగా ఇప్పుడు కేవలం 3,173 వచ్చాయి. దీనికి వివిధ కారణాలు లేకపోలేదు. ఫీజు రూ.3లక్షలు చేయడం, రియల్ ఎస్టేట్ డమాల్ అనడం, స్థానిక ఎన్నికల ఆశావహులు ఖర్చు చేయకపోతుండటంతో దీనిపై ప్రభావం పడింది. గతేడాది దరఖాస్తుల ద్వారా రూ.769.86 కోట్ల ఆధాయం వచ్చింది.