News January 7, 2026

రన్నింగ్ vs వెయిట్ లిఫ్టింగ్.. ఏది బెటరంటే?

image

రన్నింగ్ మేలా లేక వెయిట్ లిఫ్టింగ్ బెటరా? అనే ప్రశ్నకు ప్రముఖ వైద్యుడు సుధీర్ సమాధానమిచ్చారు. ‘దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం రెండింటినీ చేయడం బెటర్. శాస్త్రీయంగా చూస్తే గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణలో రన్నింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. వృద్ధాప్యంలో కండరాలు, ఎముకల దృఢత్వానికి వెయిట్ లిఫ్టింగ్ అత్యవసరం. అయితే ఈ రెండింటినీ చేయడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ & క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు’ అని తెలిపారు.

Similar News

News February 5, 2026

భారీ జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

image

సుప్రీంకోర్టులో 90 లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, ఇంటిగ్రేటెడ్ లా అర్హతతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.100000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sci.gov.in/

News February 5, 2026

బూతుపాట వివాదం.. సినీ హీరోపై కేసు నమోదు

image

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, హీరో చంద్రహాస్‌పై HYD మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ బూతు పదాలతో రాసిన పాట పాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేయగా, చంద్రహాస్ ఆయన్ను బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని, చంద్రహాస్‌పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 5, 2026

రేపు ఆర్బీఐ రెపో రేటు ప్రకటన

image

RBI రేపు ప్రకటించనున్న రెపో రేటు కోసం మార్కెట్‌ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. RBI గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైన MPC భేటీ (మానిటరీ పాలసీ కమిటీ) శుక్రవారం తన నిర్ణయాలను ప్రకటించనుంది. GDP వృద్ధి రేటు జోరు మీద ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. రెపో రేటు తగ్గితే సామాన్యుడికి లాభం కలుగుతుంది. ఇల్లు, వాహనం, పర్సనల్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గుతాయి.