News July 9, 2024

రన్‌వే విస్తరణకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

ఓర్వకల్లు విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. సోమవారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు డెవలప్‌మెంటు అధికారులతో సమీక్షించారు. రన్‌వే విస్తరణకు కావాల్సిన నిధులు, తదితర వివరాలతో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విమానాలు రాత్రి సమయంలో దిగేందుకు అనువైన చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News February 1, 2026

ఆదోని మున్సిపాలిటీలో హాట్ టాపిక్

image

ఆదోని మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని అధికారులు, నాయకుల మధ్య రాజకీయ వేడి రగులుతోంది. చైర్ పర్సన్ లోకేశ్వరి బంధువులకు రూ.1.25 కోట్లతో బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను ఇవ్వడంపై చర్చ మొదలైంది. మున్సిపాలిటీ యాక్ట్ 1965 ప్రకారం ఛైర్మన్ బంధువులకు పనులు ఇవ్వడం చట్ట విరుద్ధం. దీనిపై ఆ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, రీజినల్ జాయింట్ డైరెక్టర్ విచారణ చేస్తే విషయాలు బయటకు వస్తాయి.

News January 31, 2026

ఇంటర్ ప్రాక్టికల్స్.. సర్వం సిద్ధం: ఆర్ఐవో

image

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆర్ఐవో లాలప్ప శనివారం ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థుల కోసం 64 పరీక్షా కేంద్రాలను మొదటి విడతగా ఎంపిక చేశామన్నారు. ఒకేషనల్ విద్యార్థుల కోసం 17 పరీక్షా కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీవీఈవో, డీఈసీలు స్క్వాడ్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

News January 31, 2026

ఎమ్మిగనూరుకు సీఎం చంద్రబాబు!

image

సీఎం చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 3 లేదా 8వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో పర్యటించనున్నట్లు జేసీ నూరుల్ క్వామర్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన హెలిప్యాడ్, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. సీఎంఓ నుంచి పర్యటన తేదీపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు.