News January 7, 2026

రప్ఫాడిస్తున్న రింకూ

image

విజయ్ హజారే ట్రోఫీలో యూపీ కెప్టెన్‌గా రింకూ సింగ్ అదరగొడుతున్నారు. వరుసగా 6 విజయాలతో గ్రూప్-Bలో 24 పాయింట్లతో టీమ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా 67(48), 106*(60), 63(67), 37*(15), 41(35), 57(30) పరుగులు చేశారు. ప్రతి మ్యాచ్‌లోనూ తన మార్క్ బ్యాటింగ్, కెప్టెన్సీతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. రాబోయే T20WCలోనూ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Similar News

News February 5, 2026

పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

image

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.

News February 5, 2026

సాగునీటి సంఘాల ఛైర్మన్లతో నేడు సీఎం భేటీ

image

AP: అమరావతి పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇవాళ సాగునీటి సదస్సు జరగనుంది. రాష్ట్రంలోని 6,047 సంఘాలు, 58 ప్రాజెక్టు కమిటీలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లు హాజరుకానున్నారు. వారినుద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ, గ్రామ, మండల, జిల్లా పరిషత్ సమావేశాలకు సాగునీటి సంఘాల ఛైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడంపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.

News February 5, 2026

బెంగళూరులో గూగుల్ క్యాంపస్.. 20వేల మందికి ఉద్యోగాలు

image

వర్క్ వీసా రూల్స్‌ను US కఠినతరం చేసిన నేపథ్యంలో అవసరమైన నిపుణులను నియమించుకునేందుకు గూగుల్ ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. బెంగళూరులో భారీ క్యాంపస్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దాని విస్తీర్ణం 24 లక్షల చదరపు అడుగులని తెలుస్తోంది. ఇది పూర్తయితే దాదాపు 20,000 మంది ఉద్యోగులను కొత్తగా తీసుకునే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇండియాలోని వివిధ నగరాల్లో దాదాపు 14,000 మంది పనిచేస్తున్నారు.