News February 17, 2026
రఫేల్‌వైపే భారత్ ఆసక్తి ఎందుకు?

IAFను పటిష్ఠం చేసుకునేందుకు భారత్ 114 రఫేల్ విమానాల కొనుగోలు, లోకల్‌గా తయారీపై ఫోకస్ పెట్టింది. రష్యాకు చెందిన SU-57, USకు చెందిన F-35ను పక్కనపెట్టి రఫేల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. రఫేల్‌లో థర్ట్‌పార్టీ అవసరం లేకుండా డైరెక్ట్ డేటా ఎక్స్‌ఛేంజ్‌కు అవకాశం ఉండటం, మెయింటైన్ సులభంగా ఉండటం, వీటి కొనుగోలుతో ఎలాంటి రాజకీయ సవాళ్లు రాకపోవడం వల్ల భారత్ దీనికి ప్రాధాన్యం ఇస్తోంది.
Similar News
News February 17, 2026
ALERT: మీ ఐఫోన్‌ను అప్డేట్ చేసుకోండి!

ఐఫోన్‌లోని 39 భద్రతా లోపాలను సరిచేస్తూ యాపిల్ iOS 26.3 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ లోపాల వల్ల హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే లేదా ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల సైబర్ దాడులు జరిగినట్లు సమాచారం. అందుకే ఐఫోన్‌ను అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. Settings > General > Software Update లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.
News February 17, 2026
సభకు రాని MLAలను రికాల్ చేయాలి: స్పీకర్

AP: సభకు హాజరుకాని MLAలను రికాల్ చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ‘8 దేశాల్లో ఈ విధానం ఉంది. కొందరు MLAలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. విధులకు రాకపోతే ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తున్నాం. అలాగే వీరి శాలరీ ఎందుకు కట్ చేయకూడదు’ అని ప్రశ్నించారు. సభలో MLAల కన్నా మాక్ అసెంబ్లీలో విద్యార్థులే బాగా మాట్లాడారని తెలిపారు. ఇక డిజిటల్ అటెండెన్స్ పనితీరు బాగుందన్నారు.
News February 17, 2026
మ.1.30 గం. వరకే స్కూళ్లు

TG: రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.8 గం. నుంచి మ.1.30 గం. వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ముస్లిం ఉద్యోగులు ఈ మాసంలో 4PM కల్లా విధులు ముగించి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.


