News December 22, 2025
రబీ వరి సాగుకు అనువైన సన్న గింజ రకాలు

వరిలో మిక్కిలి సన్న గింజ రకాలు అంటే 1000 గింజల బరువు 15 గ్రాముల కన్నా తక్కువగా ఉన్న రకాలు. 125 రోజులు కాల పరిమితి కలిగిన రకాలు N.L.R 34449 (నెల్లూరు మసూరి), N.L.R 3354 (నెల్లూరు ధాన్యరాశి), M.T.U 1282, N.L.R 3648, M.T.U 1426. ఇవి మిక్కిలి సన్నగా, నాణ్యత కలిగి తినడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. వీటిని అందుబాటులో ఉన్న నీటి వసతి, స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి నిపుణుల సూచనలతో విత్తుకోవాలి.
Similar News
News December 27, 2025
వివిధ పంటల్లో తెగుళ్లు – తట్టుకునే విత్తన రకాలు

☛ టమాటాలో బాక్టీరియా ఎండుతెగులు, ఆకుముడత వైరస్ తెగులు తట్టుకొనే రకాలు: అర్కా అనన్య, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్
☛ వంగలో బాక్టీరియా ఎండు తెగులును తట్టుకొనే రకాలు: అర్కా ఆనంద్, అర్కా నిధి, అర్కా కేశవ ☛ బెండలో వైరస్‌ను తట్టుకొనే రకాలు: అర్కా అనామికా, అర్కా అభయ్, పర్బానీ కాంతి ☛ మిరపలో వైరస్, బూడిద తెగుళ్లను తట్టుకునే రకాలు: అర్కా హరిత. ఇవి భారతీయ ఉద్యానవన పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన విత్తనాలు.
News December 27, 2025
సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?

TG: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు 7 రోజులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అకడమిక్ ఇయర్ ప్రారంభంలో JAN 11-15వ తేదీ వరకు సెలవులున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. తాజాగా విడుదల చేసిన క్యాలెండర్‌లో 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ అని ఉంది. దీంతో సెలవులపై పున:సమీక్షించుకొని 2వ శనివారంతో కలుపుకొని జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. అటు APలో జనవరి 10-17 వరకు హాలిడేస్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News December 27, 2025
నేడు CWC కీలక భేటీ

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు. ఈ భేటీలో ‘వీబీ-జీ రామ్ జీ’ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై ముఖ్యంగా చర్చించే అవకాశముంది. అలాగే త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ స్ట్రాటజీ ఖరారు చేయనున్నట్లు సమాచారం.


