News December 24, 2025
రబీ సీజన్‌కు సరిపడా యూరియా సిద్ధం: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీ సీజన్ సాగుకు అవసరమైన యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్ నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. 2025-26 ఏడాదికి అన్ని రకాల పంటల కోసం 29,241 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఎరువుల కొరత లేకుండా రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News December 28, 2025
డిసెంబర్ 31 నుంచి సంక్రాంతి వరకు నిఘా: బాపట్ల SP

బాపట్ల జిల్లాలో మైనర్లు మాత్రమే వచ్చి రిసార్ట్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో రూములు కోరితే ఇవ్వకూడదని SP ఆదేశించారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి సంక్రాంతి పండుగ ముగిసేవరకు, అనంతరం జిల్లాలో ఎలాంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగనీయబోమన్నారు. రిసార్ట్స్, హోటళ్లలో గానీ, అక్కడ బస చేసినవారి ద్వారాగానీ చట్ట ఉల్లంఘనలు జరిగితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 28, 2025
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 3 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ(హిందీ) పీహెచ్‌డీ, NET/JRF అర్హత గల అభ్యర్థులు జనవరి 5వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in/
News December 28, 2025
కొత్తగూడెం: ఈ ఏడాది చోరీ కేసుల వివరాలు ఇలా..!

జిల్లాలో ఈ ఏడాది 307 చోరీ కేసుల్లో రూ.3,75,10,691 సొత్తును కోల్పోగా 141కేసుల్లో రూ.1,21,99,297 సొత్తును రికవరీ చేశామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లోక్ అదాలత్లో ఈ ఏడాది మొత్తం వివిద రకాల 20,595 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 15,347 కేసులు, సైబర్ క్రైమ్ సంబంధించి 196 కేసులు నమోదయ్యాయని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.


