News February 4, 2026

రమేశ్ మాదిగ హత్య కేసులో 12 మంది అరెస్ట్

image

MRPS రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రమేశ్ మాదిగ హత్య కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ఈ హత్యకు నిరసనగా, నిందితులను శిక్షించాలని దళిత సంఘాలు కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. ముమ్మర దర్యాప్తు అనంతరం ముద్దాయిలను పట్టుకున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.

Similar News

News February 21, 2026

ఆ కామెంట్స్ తర్వాత 3 రోజులు నిద్రపట్టలేదు: శివాజీ

image

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై తాను చేసిన వివాదాస్పద <<18692465>>వ్యాఖ్యలపై<<>> నటుడు శివాజీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఏ మహిళనూ తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ‘నేను పబ్లిక్‌లో ఎప్పుడూ నోరు జారలేదు. ఆ రోజు 2 పదాలు ఎందుకు తప్పుగా మాట్లాడానో అర్థం కాలేదు. ఆ కామెంట్స్ తర్వాత 3 రోజులు నిద్ర పట్టలేదు. ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యా. కానీ నా ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు’ అని తెలిపారు.

News February 21, 2026

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

image

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. డివిజనల్ స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ కేంద్రాల అనుమతులు రద్దు చేయడంతో పాటు, జరిమానాలు, క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. లింగ వివక్ష నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News February 21, 2026

తల్లిపాలు పెంచే ఫుడ్స్ ఇవే..

image

మొదటిసారి తల్లైన తర్వాత మహిళలకు ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. వాటిల్లో ఒకటే తగినంత పాలు ఉత్పత్తికాకపోవడం. ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, ఓట్స్, నువ్వులు, మెంతులు తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.