News August 23, 2025

రవీంద్రభారతిలో ఈనెల 24న నృత్యనాటక సౌరభం

image

తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ నెల 24న నృత్య నాటక సౌరభం నిర్వహించనున్నట్లు అకాడమీ ఛైర్‌పర్సన్‌ డా.అలేఖ్య పుంజాల తెలిపారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య, సినీ నటి జీవిత రాజశేఖర్ తదితరులు హాజరవుతారన్నారు. డా.స్మితా మాధవ్‌ ఆధ్వర్యంలో నృత్య రూపకంతోపాటు శరణు దాసు జానపద నాటకం ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

Similar News

News September 12, 2025

పునర్విభజన చట్టం: HYD- అమరావతికి రైల్వే లైన్

image

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. GM సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని సైతం చెప్పారు.

News September 12, 2025

HYD: విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సప్ గ్రూప్

image

బంజారాహిల్స్ డివిజన్లో విద్యుత్ అధికారులు సమస్య పరిష్కారానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఇక్కడ 195 ఫీడర్లుండగా ఆ వినియోగదారులతో కలిపి 195 వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ప్రజలు తమ విద్యుత్ సమస్యను గ్రూపులో పోస్టు చేస్తే వెంటనే సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారు. గ్రూపుల్లో సిబ్బందితోపాటు 30 మంది అధికారులు కూడా ఉంటారు. వీటితోపాటు 1912 సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

News September 12, 2025

హైదరాబాద్‌లో అతిపెద్ద ఎగ్జిబిషన్ నవంబర్‌లో

image

భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానుంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్ నవంబర్ 25 నుంచి జరుగనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 500 మంది ఎగ్జిబిటర్లు, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని పౌల్ట్రీ అసోసియేషన్ నాయకులు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.