News December 30, 2025
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్!

రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. కాగా దీనిపై హీరోహీరోయిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
Similar News
News February 14, 2026
నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల వారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsi.gov.in
News February 14, 2026
25వేలకు పైగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. GD, టెక్నికల్, క్లర్క్/ స్టోర్‌కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 25వేలకుపైగా ఖాళీలున్నాయి. పోస్టును బట్టి 8th క్లాస్, టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. 17½-25 ఏళ్ల వయసుండాలి. APR 1 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 1-15 వరకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
News February 14, 2026
అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందొచ్చు!

రిస్క్ లేకుండా అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందవచ్చు. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (MODS) ద్వారా సేవింగ్స్ అకౌంట్‌లో నిర్ణీత పరిమితి దాటిన డబ్బు ఆటోమేటిక్‌గా FDగా మారుతుంది. అవసరమైనప్పుడు ఆ డబ్బును ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది. తక్కువ రిస్క్‌తో ఎక్కువ వడ్డీ వస్తుంది. చాలా బ్యాంకుల్లోనూ ఈ సౌకర్యం ఉన్నప్పటికీ లిమిట్‌లో తేడాలున్నాయి. SHARE IT


