News January 5, 2026

రష్యాకు పారిపోనున్న ఖమేనీ?

image

ఇరాన్‌లో పౌరుల ఆందోళనలతో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా చెబుతోంది. తన ఫ్యామిలీతో పాటు 20 మంది కంటే తక్కువ బృందంతో కలిసి వెళ్లనున్నారని పేర్కొంది. ఖమేనీ రష్యా రాజధాని మాస్కోకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అంతకుమించి ఆయనకు ఆప్షన్ లేదని USలో ఉంటోన్న ఇరాన్ మాజీ నిఘా అధికారి తెలిపారు.

Similar News

News January 7, 2026

బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్ రీషఫుల్?

image

బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిలో భాగంగా పలువురు మంత్రులను తొలగిస్తారని సమాచారం. ముఖ్యంగా మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని భావిస్తున్నారు. వారి స్థానంలో పార్టీ సీనియర్లు, సంఘ్‌ సన్నిహితులకు చోటు లభిస్తుందని చెబుతున్నారు. కాగా EX బ్యూరోక్రాట్స్ అయిన జైశంకర్‌, హర్దీప్‌, అర్జున్‌ రాం, అశ్వినీ వైష్ణవ్‌ ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు.

News January 7, 2026

సచిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ పెళ్లి డేట్ ఫిక్స్!

image

సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి మార్చి 5న జరగనున్నట్లు TOI పేర్కొంది. 2025 ఆగస్టులోనే వీరి నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగింది. మార్చి 3 నుంచి ముంబైలో పెళ్లి వేడుకలు షురూ కానున్నాయి. ఇటీవలే అర్జున్ నిశ్చితార్థాన్ని సచిన్ ధ్రువీకరించారు.

News January 7, 2026

₹5800 CRతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

image

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 KM మేర నదిని సుందరీకరణ చేస్తారు. ముందుగా నదిలో పూడిక తీసి తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆపై గోదావరి నీరు ప్రవహించేలా ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.