News August 15, 2024

రష్యాలో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన కాకినాడ DFO

image

రష్యాలో ఎత్తైన ఎల్‌బ్రస్ శిఖరాన్ని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.భరణి అధిరోహించారు. ఈ సందర్భంగా ఆమె శిఖరాన్ని అధిరోహించిన తర్వాత సగర్వంగా మన దేశ మువ్వన్నెల జెండాను ఎగురవేసి అభివాదం చేశారు. గత కొన్నేళ్లుగా భరణి పర్వతారోహకురాలుగా కీర్తి గడించారు. గతేడాది కిలిమంజారో శిఖరం ఎక్కారు.

Similar News

News October 24, 2025

రాజమండ్రిలో ఈ నెల 25న జాబ్ మేళా

image

ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 24, 2025

రాజమండ్రి: చింతాలమ్మ ఘాట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గోదావరి నది ఒడ్డున చింతాలమ్మ ఘాట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నల్లటి చారలు గల షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఇతని వయస్సు సుమారు 50-55 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. మృతుడి వివరాలు తెలిసినవారు వెంటనే III టౌన్ L&O పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ (సెల్: 9440796532) లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ (సెల్: 9490345517)కు తెలపాలని త్రీ టౌన్ సీఐ కోరారు.

News October 23, 2025

వార్డెన్‌లు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

తూ.గో. జిల్లాలోని వసతి గృహాల వార్డెన్‌లు పిల్లల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం స్పష్టం చేశారు. రాజమండ్రిలో బుధవారం ఆమె మాట్లాడారు. పిల్లలను పంపించేటప్పుడు, వారి సంరక్షణకు భద్రతా నిబంధనలు పాటిస్తూ, బంధువుల వివరాలు, తగిన ఆధారాలు నమోదు చేసుకున్న తర్వాతే వారిని పంపించాలని ఆమె ఆదేశించారు.