News August 21, 2024
రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి

రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని తెలుగు యువతి అధిరోహించింది. ఈ పర్వతం రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642మీ(18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని 10వ-అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ అలవోకగా అధిరోహించారు. ఆమె త్వరలో తాడేపల్లికి రానున్నారు.
Similar News
News February 4, 2026
పురుష ఆరోగ్య కార్యకర్తల పునఃనియామకానికి దరఖాస్తుల గడువు పెంపు

1207 జీఓ ప్రకారం 2024లో విధుల నుంచి తొలగించిన పురుష ఆరోగ్య కార్యకర్తల్లో 40 మందిని సుప్రీంకోర్టు ఆదేశాలు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనుమతితో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ నియామక పత్రాలు అందజేసినట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లాలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ FEB 10వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు.
News February 4, 2026
‘SDG సూచికల లక్ష్యాలు 100 శాతం అధిగమించాలి’

జిల్లాలో స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన సూచికలు 100 శాతం అధిగమించేలా అన్ని శాఖలు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి లక్ష్యాల సూచికలను 100 శాతం సాధించాలన్నారు. సమావేశంలో ZP CEO జ్యోతిబస్ పాల్గొన్నారు.
News February 4, 2026
GNT: అమరజీవి స్మారకానికి మునిమనవరాలి విరాళం

అమరావతిలో 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ నిర్మాణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌కు 58 లక్షల రూపాయల విరాళాన్ని పొట్టి శ్రీరాములు గారి మునిమనవరాలు కుందా ప్రతిభ ప్రకటించారు. ఈ సందర్భంగా కుందా ప్రతిభ, కుంద ప్రతాప్‌కి ట్రస్ట్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విరాళం విగ్రహ నిర్మాణానికి కీలకంగా నిలవనుందని పేర్కొన్నారు.


