News February 12, 2026

రష్యాలో వాట్సాప్‌పై నిషేధం.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు!

image

వాట్సాప్‌ను బ్యాన్ చేసినట్లు రష్యా ధ్రువీకరించింది. తమ చట్టాలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. 100 మిలియన్ల యూజర్లను స్వదేశీ మెసెంజర్ యాప్ ‘MAX’కు మారాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే మ్యాక్స్ సర్వైలెన్స్(నిఘా) యాప్ అని ఆరోపణలు రాగా వాటిని అధికారులు ఖండించారు. ‘టెలిగ్రామ్‌’పైనా దశలవారీగా ఆంక్షలు విధించే యోచనలో రష్యా ఉన్నట్లు సమాచారం.

Similar News

News February 14, 2026

స్టైలింగ్ ఇలా మార్చుకోండి

image

చాలామంది అమ్మాయిలు ఫేస్ చేసే సమస్య ఎన్ని దుస్తులున్నా వేసుకోవడానికి ఏవీ లేవనేది వారి బాధ. కొత్త బట్టలు కొనకుండా స్టైలింగ్ కాస్త మారిస్తే మీ వార్డ్‌రోబ్ కొత్తగా కనిపిస్తుంది. ఉన్నవాటినే రంగులూ, డిజైన్ల వారీగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ట్రెండీ దుస్తులు కాకుండా మీ ఒంటి తీరుకు ఏవి నప్పుతాయో చూసుకోండి. మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరేం వేసినా అందంగా కనిపిస్తారు.

News February 14, 2026

జ్యోతికతో పెళ్లికి నిరాకరించిన సూర్య తండ్రి.. ఆ ఒక్క మాటతో!

image

ప్రేమికుల దినోత్సవం వేళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ వైరలవుతోంది. వీరి పెళ్లికి తొలుత సూర్య తండ్రి శివకుమార్ అంగీకరించలేదట. ‘పెళ్లి చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటా. లేదంటే ఒంటరిగా ఉంటా’ అని సూర్య కరాఖండిగా చెప్పడంతో తన మనసు మార్చుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1999లో మొదలైన వీరి ప్రేమ 2006లో పెద్దల ఆశీస్సులతో పెళ్లిగా మారింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.

News February 14, 2026

IND vs PAK: రేపు ‘మహా’ సంగ్రామం.. ఇప్పటి వరకు మనదే జోరు!

image

T20 WCలో IND vs PAK మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా 7-1తో మనదే ఆధిపత్యం. 2007 ‘బౌల్ అవుట్’ విక్టరీ నుంచి 2024 ‘న్యూయార్క్ లో-స్కోరింగ్ థ్రిల్లర్’ వరకు భారత్ తన సత్తాను చాటుతూనే ఉంది. విరాట్ కోహ్లీ మెల్బోర్న్ మిరాకిల్ (2022), బుమ్రా డెత్ ఓవర్ల మ్యాజిక్ (2024) వంటి మధుర జ్ఞాపకాలతో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రేపటి మ్యాచ్‌లోనూ దాయాదుల పోరు ఆసక్తికరంగా సాగనుంది. IND విజయాల ఫొటోలను పైన చూడొచ్చు.