News January 7, 2026
రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.
Similar News
News February 13, 2026
ఓట్ల లెక్కింపు ప్రారంభం

TG: రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 123 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీలు, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.
News February 13, 2026
శివుడి మెడలో పుర్రెల దండ ఎందుకంటే

వర గర్వంతో విర్రవీగుతున్న రాక్షసులను అదుపు చేయడానికి మహావిష్ణువు సూచనతో శివుడు ఈ భీకర రూపాన్ని ధరించాడు. వారిని చెడు మార్గం నుంచి మళ్లించి, వారి ఆత్మతేజస్సును తగ్గించడం ద్వారా దేవతలను రక్షించాడు. ఇది కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు. ధర్మాన్ని నిలబెట్టడానికి హరిహరులు చేసిన సంయుక్త ప్రయత్నం. అలాగే, ఇది జీవితం శాశ్వతం కాదని, అంతిమంగా అంతా శూన్యమని తెలిపే వైరాగ్యానికి ప్రతీక.
News February 13, 2026
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL) 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, మైనింగ్ ఇంజినీరింగ్ అర్హత గలవారు FEB 16 నుంచి మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. Jr. ఓవర్‌మెన్‌కు పే స్కేల్ రూ.31K-రూ.లక్ష, మైనింగ్ సిర్దార్‌కు రూ.26K-రూ.1,10,000. సైట్: www.nlcindia.in


