News December 9, 2025
రసవత్తరంగా పల్లెపోరు.. విందులతో ఓటర్ల మచ్చిక

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లెపోరు రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ గ్రామాల్లో బరిలో నిలిచిన నేతలు ఎవరికివారు గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. పార్టీలు, వినోదాలు ఆఫర్ చేస్తూ అందరినీ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి చికెన్, మటన్ పార్సిల్స్ పంపిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రతి ఛాన్స్‌ను ప్రచారానికి వినియోగించుకుంటున్నారు.
Similar News
News December 11, 2025
BHPL: ఓటు హక్కు వినియోగానికి ఇవి తప్పనిసరి: కలెక్టర్

ఈనెల 11, 14, 17వ తేదీల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా చూపించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఓటర్, ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇండియన్ పాస్‌పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, రేషన్ కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లాలని సూచించారు..
News December 11, 2025
MHBD: నాన్నపై ప్రేమతో!

MHBD(D) కొత్తగూడ(M) వెలుబెల్లికి చెందిన రాజు తన తండ్రిపై ఉన్న ప్రేమను అద్భుతంగా చాటుకున్నాడు. కొన్ని నెలల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, బాధను దిగమింగుకుని వినూత్నంగా నివాళులర్పించాడు. తమ పొలంలో నారుమడి వేస్తూ ఏకంగా తన తండ్రి ఎల్లయ్య పేరునే నారుతో తీర్చిదిద్దాడు. ఈ భావోద్వేగ ఘట్టం ఇప్పుడు ఆ ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తండ్రిపై కొడుకు చూపిన ఈ ప్రేమాభిమానం పలువురిని కదిలిస్తోంది.
News December 11, 2025
నేడే రెండో T20.. మ్యాజిక్ కొనసాగిస్తారా?

IND-SA మధ్య 5 T20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ ముల్లాన్‌పూర్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. తొలి T20లో IND 101 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బౌలింగ్‌లో మెప్పించిన భారత్ బ్యాటింగ్‌లో కాస్త కంగారు పెట్టింది. హార్దిక్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. అందుకే బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


