News December 20, 2025
రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు, అధికారులు, ఆర్టీసీ డ్రైవర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. రోడ్డు భద్రత నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. విద్యార్థుల్లో రహదారి నియమాల పట్ల అవగాహన కలిగేలా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.
Similar News
News December 21, 2025
శీతాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

సాధారణంగా శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి పాలకూర, బీట్‌రూట్, గుడ్లు, చేపలు, చికెన్ పాలు, పెరుగు వంటి ఇనుము, బి12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి శరీరం వెచ్చగా ఉంటుంది. బాదం, వాల్‌నట్స్, ఖర్జూరం శక్తిని అందిస్తాయి. జీలకర్ర, పసుపు, నల్ల మిరియాలు వంటివి శరీరం లోపల నుండి వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి.
News December 21, 2025
ANU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 2వ ఏడాది రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి నిర్వహిస్తామని..ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 29లోపు, రూ.100 ఫైన్‌తో 30లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.
News December 21, 2025
KNR: ఆదిలోనే అడ్డంకి.. నిరాశ కలిగిస్తున్న ఫెర్టిలైజర్ యాప్

రైతులకు ఎరువుల లభ్యత, నిల్వలు, ధరల వివరాలను వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘Fertilizer’ మొబైల్ అప్లికేషన్ ప్రారంభంలోనే మొరాయించింది. యాప్ ఓపెన్ చేయగానే “ఈ యాప్ తాత్కాలికంగా నిలిపివేయబడింది” అనే సందేశం కనిపిస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలు కాగితాల మీద పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడేలా ఉండాలని ఉమ్మడి KNR రైతులు కోరుకుంటున్నారు.


