News July 7, 2025

రాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. తలమీద నుంచి వెళ్లిన లారీ

image

నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లిలోని వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద లారీ కింద పడి వ్యక్తి దుర్మరణం చెందాడు. బైక్‌ మీద వస్తున్న వ్యక్తి స్కిడ్ అయి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ ఆయన తలపై ఎక్కింది. దీంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుడు నారపల్లికి చెందిన బాసిత్‌గా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 7, 2025

NRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

News July 7, 2025

వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

image

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్‌ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్‌ను రిలీజ్ చేశారు.

News July 7, 2025

అరకు: ఈ నెల 10 సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరి

image

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 10వతేదీన పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యండపల్లివలస APTWRJC(బాలికలు) ప్రిన్సిపాల్ అల్లు సత్యవతి తెలిపారు. కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుతుందని నేడు ఆమె తెలిపారు. కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రిన్సిపల్ కోరారు.