News January 4, 2026
రాంబిల్లి: అగ్ని ప్రమాదంపై కేసు నమోదు

రాంబిల్లి మండలం లాలంకోడూరు ఎస్.వీ.ఎస్. ఫార్మా కంపెనీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింగరావు ఆదివారం తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వీఆర్ఓ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News January 21, 2026
మేడారం జాతరకు 244 ప్రత్యేక బస్సులు:ఆర్ఎం సరీరామ్

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం ఖమ్మం రీజియన్ నుంచి 244 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌ఎం సరీరామ్ తెలిపారు. ఖమ్మం నుంచి 10, ఇల్లందు 41, సత్తుపల్లి 17, చర్ల 3, వెంకటాపూర్ 6, భద్రాచలం 21, పాల్వంచ 15, కొత్తగూడెం 110, మణుగురూ 16, మంగపేట 5 సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులన్నీ మేడారంలోని గద్దెల సమీపానికే వెళ్తాయని పేర్కొన్నారు.
News January 21, 2026
NZB: నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడి అరెస్టు

నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు NZB సైబర్ క్రైమ్ ACP వై. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిందితుడు టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి మాటలను నమ్మి, విదేశాల్లో అధిక జీతంతో ఉద్యోగాలు ఉన్నాయంటూ మోసాగిస్తున్నాడన్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
News January 21, 2026
ANU: డిగ్రీ 6th సెమిస్టర్ వైవా షెడ్యూల్ రిలీజ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 6వ సెమిస్టర్ వైవా షెడ్యూల్ ను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆరో సెమిస్టర్ వైవా జరుగుతోందన్నారు. విద్యార్థులు ఫిబ్రవరి 20వ తేదీలోపు ఫీజు చెల్లించాలన్నారు. అపరాధ రుసుం రూ.100తో 23వ తేదీలోపు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.


