News December 9, 2025

రాంబిల్లి: ఆరుగురు విద్యార్థులు అదృశ్యం

image

రాంబిల్లి మండలం వెంకటాపురంలో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వీరి ఆచూకీ లభించలేదు. దీంతో ట్రస్ట్ యాజమాన్యం రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఆచూకీ కోసం రాంబిల్లి పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థులు స్కూలు నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది.

Similar News

News December 17, 2025

జనగామ: 83.27 శాతం పోలింగ్ @1PM

image

జనగామ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 నుంచి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 83.27 శాతం పోలింగ్ నమోదయింది. పాలకుర్తిలో 80.06 శాతం, దేవరుప్పులలో 87.64 శాతం, కొడకండ్లలో 83.39 శాతం నమోదయింది.

News December 17, 2025

APPLY NOW: ICMRలో 28 పోస్టులు

image

<>ICMR<<>> 28 సైంటిస్ట్-B పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/

News December 17, 2025

మంత్రి నేతృత్వంలో కమిటీ ఎందుకో.. ఆ నేతల్లో నిరాశ.!

image

కృష్ణా, NTR జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఖరారు కావడంతో, పదవులు దక్కని నేతల్లో నిరాశ నెలకొంది. MLAలు ప్రతిపాదించిన బుద్ధా వెంకన్న, కోనేరు నాని వంటి పేర్లకు కాకుండా, కొత్త వ్యక్తులకు పదవులు దక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశమై పేర్లు పంపినా, వాటిని అధిష్ఠానం పరిగణించకపోవడంపై ‘అసలు కమిటీ ఎందుకు వేశారు?’ అనే చర్చ TDP శ్రేణుల్లో నడుస్తోంది.