News April 24, 2025
రాంబిల్లి: తండ్రిని హత్య చేయించిన కొడుకు

రాంబిల్లి మండలం చినకలువలాపల్లిలో ఈ నెల 21న వడ్డీ వ్యాపారి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జల్లి తాతారావును కొడుకు అప్పల రెడ్డే హత్య చేయించాడని సీఐ నరసింగరావు బుధవారం తెలిపారు. తండ్రి తన ఆస్తిని సవతి తల్లి కుమార్తెకు ఇచ్చేస్తాడని అనుమానించి ఇద్దరు వ్యక్తులను పురమాయించి హత్య చేయించినట్లు తెలిపారు. అప్పల రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
Similar News
News April 24, 2025
ఉగ్రదాడి.. కలిమా చదివి తప్పించుకున్నాడు!

కలిమా చదవడంతో పహల్‌గామ్ ఉగ్రదాడి నుంచి అస్సాం వర్సిటీ ప్రొఫెసర్ దేబాశిష్ తప్పించుకున్నారు. ఫ్యామిలీతో టూర్‌కు వెళ్లిన ఆయన మాటల్లో.. ‘చుట్టూ జనాలు పడిపోతుండగా పక్కన కొందరు ‘కలిమా (ఇస్లాంపై విశ్వాస వాక్యం)’ చదువుతున్నారు. వారిని చూసి నేనూ అలా చదివాను. నా పక్కన వ్యక్తిని కాల్చిన టెర్రరిస్ట్.. నన్ను డౌట్‌తో మళ్లీ కలిమా చెప్పమన్నాడు. వణుకుతూనే చదివిన తర్వాత నన్ను వదిలేసి ముందుకెళ్లారు’ అని వివరించారు.
News April 24, 2025
కర్రెగుట్టలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. హిడ్మా, దేవా వంటి అగ్ర కమాండర్లు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని 3వేలకు పైగా బలగాలు చుట్టుముట్టాయి. నేలమీది నుంచి, గగనతలం నుంచి ముమ్మర కూంబింగ్‌తో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. ఈక్రమంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోలు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
News April 24, 2025
అనకాపల్లి: మే 19 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

అనకాపల్లి జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సెకండరీ బోర్డు, 10వ తరగతి పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్.ఎం లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.