News February 18, 2026
రాంబిల్లి: పేలిన అమ్మోనియా గ్యాస్ సిలిండర్.. ఉద్యోగి మృతి

రాంబిల్లి మండలంలో ఇన్నోవేర్ ల్యాబ్ పరిశ్రమలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో కెమిస్ట్ బొద్ద అజయ్ కుమార్ (21) మృతి చెందాడు. అమోనియా గ్యాస్ సిలిండర్ ఆకస్మికంగా పేలడంతో విషవాయువు వ్యాపించింది. విషవాయువును పీల్చిన అజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కెమిస్ట్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 19, 2026
అష్టలక్ష్మి: ధాన్యలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

ధాన్యలక్ష్మి దేవి ఆరాధనలో నీలవర్ణం వస్త్రం ఉంచి, పచ్చని పూలతో పూజ చేయాలి. ధాన్యలక్ష్మి వ్యవసాయానికి, ఆహారానికి అధిదేవత. పచ్చని పూలు ప్రకృతికి, జీవకళకు సంకేతం. మనింట్లో ఎప్పుడూ ఆహారానికి లోటు లేకుండా ఉండాలని ఈ దేవిని ప్రార్థిస్తారు. నీలవర్ణం అనంత ఆకాశాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతిలో పూజించడం వల్ల రైతులు పంటలు బాగా పండుతాయని, సాధారణ ప్రజలు ఆకలి బాధలు లేకుండా సుభిక్షంగా ఉంటారని నమ్మకం.
News February 19, 2026
నువ్వుల సాగు.. కాండంకుళ్లు తెగులు నివారణ

కాండంకుళ్లు తెగులు ఆశించిన నువ్వుల పంట కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేర్లను చీల్చితే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోయి, చనిపోతాయి. అధిక తేమ పరిస్థితులు ఉన్నప్పుడు కాండంకుళ్లు తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News February 19, 2026
HYD: SMలో పోస్టులు పెట్టకపోతే బతికేదేమో..?

వనస్థలిపురంలో గర్భిణిని మాజీ భర్త చంపడానికి ప్రధాన కారణం SMలో పెట్టిన ఫొటోలేనా అంటే..అవుననే సమాధానం వస్తోంది. మహారాష్ట్రకు చెందిన సునీత, పెద్దపల్లివాసి మహేశ్ 2022లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో 2024లో విడిపోయారు. ఆపై HYDలో పరిచయమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనాథ్‌ను సునీత రెండో వివాహం చేసుకుని తానిప్పుడు హ్యాపీగా ఉన్నట్లు SMలో పోస్ట్ చేసింది. ఇదిచూసి రగిలిపోయిన మహేశ్ <<19175503>>మాజీ భార్యను నరికి చంపాడు.<<>>


