News February 9, 2025

రాంబిల్లి సముద్ర తీరంలో ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

image

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి  బీచ్‌లో స్నానం చేయడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 9, 2025

చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

image

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్‌ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.

News November 9, 2025

రూ.318 కోట్లతో ఫుడ్ పార్కులు.. 11న సీఎం శంకుస్థాపన

image

ఏలూరు జిల్లాలో ఏర్పాటు కానున్న రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు నవంబర్ 11న వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. ద్వారకాతిరుమలలో రూ.208 కోట్లతో గోద్రెజ్ ఆగ్రోవెట్, నూజివీడులో రూ.110 కోట్లతో రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,866 మందికి ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.

News November 9, 2025

భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

image

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్‌లో భారీ డిమాండ్‌తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.