News November 11, 2025

రాంబిల్లి: 106 ఎకరాల్లో రూ.1175 కోట్లతో పరిశ్రమ

image

బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.1175 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్.కె అగర్వాల్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ రాంబిల్లి మండలంలో కృష్ణంపాలెంలో మంగళవారం ఆయన పర్యటించారు. వచ్చే సంవత్సరంలో దీపావళి నాటికి రూ.605 కోట్లతో ఫేజ్-1 పూర్తి కానుంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

Similar News

News November 12, 2025

‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి’

image

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌తో కలిసి గృహ నిర్మాణశాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీలలో మొక్కల పెంపకం, ఈనెల 14న పాఠశాలలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

News November 12, 2025

ఎగ్జిట్ పోల్స్: 2015, 2020లో ఏం జరిగింది?

image

బిహార్ ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ పట్టలేకపోతున్నాయని 2015, 2020 ఎన్నికల ఫలితాల్లో తేలింది. 2015లో మహాఘట్‌బంధన్‌(JDU+RJD+INC), NDAకు గట్టి పోటీ ఉంటుందని 6 మేజర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే MGB 178 సీట్లు గెలవగా, NDA 58 సీట్లకు పరిమితమైంది. 2020లో MGB(INC+RJD)దే గెలుపని 11 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే JDUతో కూడిన NDA 125 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
* మరి ఈసారి తీర్పు ఎలా వస్తుందో?

News November 12, 2025

కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డి చెప్పింది ఇదేనా.?

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో TTD మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రమేయం లేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. హైకమాండ్(బోర్డ్/ పొలిటికల్) నిర్ణయాల మేరకే టెండర్లకు ఆమోదం తెలిపామని, రూల్స్‌కు అనుగుణంగా బోర్డులో నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం.