News August 10, 2025

‘రాఖీ’ రోజే సోదరిని కోల్పోయిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే

image

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి నాడే ఇబ్రహీంపట్నం MLA ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శనివారం తన సోదరి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగేటి భూదేవి నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ రోజు వారి స్వగ్రామం తొర్రూరులో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News August 10, 2025

కొంపల్లి: జర భద్రం.. మాయ‘దారి’ మనకొద్దు

image

సుచిత్ర- కొంపల్లి- మేడ్చల్ దారిలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో లేని దారిని సృష్టించి బైక్‌లను ఫుట్‌పాత్, డ్రైనేజీ మీద నుంచి వెళుతున్నారు. ఇలా వెళ్లడం ప్రమాదకరం అని అధికారులు హెచ్చరిస్తున్నారను. దారి పొడవునా రాకపోకలకు ఇబ్బంది నెలకొందని ఈ తరహా ప్రయాణాలతో ఇతరులకు ప్రమాదం జరిగుతుందని అధికారులు చెబుతున్నారు. జర ఉన్న దారిలో వెళ్లి ఉన్నవారికి తోడుగా ఉండు సోదరా అని పలువురు SMలో కామెంట్లు చేస్తున్నారు.

News August 10, 2025

HYD: రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణా కమిటీ చర్యలు?

image

నాంపల్లిలోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, వరంగల్ నేత కొండా మురళీ వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వీరిపై ఏదో రకంగా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

News August 10, 2025

HYD: పెళ్లైన గంటల్లోనే గుండెపోటుతో యువకుడి మృతి

image

వివాహమైన కొద్ది గంటల్లోనే ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. బడంగ్‌పేట్ లక్ష్మీదుర్గకాలనీకి చెందిన ఈవెంట్స్ మేనేజర్‌ విశాల్ కుమార్ (25)కు ఈ నెల 7న వివాహం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకోగానే విశాల్ అస్వస్థకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గ్లోబల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.