News February 17, 2026

రాగి పంటకు నీరు అందించడంలో జాగ్రత్తలు

image

రాగి పంటకు నీటిని అందించే విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. నాట్లు వేసిన రాగి పొలంలో పైరు బాగా వేర్లు తొడిగే వరకు అంటే సుమారు 10 రోజుల వరకు నీరు పెట్టకూడదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రాగి పంట సాధారణంగా వర్షాధార పంట అయినప్పటికీ కీలక దశలైన మొలకెత్తే దశ, పూత, గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను ఇస్తే దిగుబడి బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Similar News

News February 27, 2026

రింకూ సింగ్.. తండ్రి చనిపోయిన బాధలోనూ..

image

T20WC: యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ రేపు కోల్‌కతాలో భారత జట్టులో చేరుతారని బీసీసీఐ వెల్లడించింది. మార్చి 1న టీమ్ ఇండియా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. కాగా ఇవాళ తండ్రి మరణంతో <<19254408>>రింకూ<<>> సింగ్ అలీగఢ్ (యూపీ) వెళ్లిన సంగతి తెలిసిందే. తండ్రి <<19250311>>మరణించిన<<>> మరుసటి రోజే రింకూ దేశం కోసం ఆడేందుకు సిద్ధం కావడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

News February 27, 2026

స్వాతంత్ర్యం వచ్చినా బానిస మనస్తత్వం పోలేదు: ప్రధాని మోదీ

image

ఒకప్పుడు ఫారిన్ టెక్నిక్స్ కాపీ కొట్టే దుస్థితిలో భారత్ ఉండేదని ప్రధాని మోదీ రైజింగ్ భారత్ సమ్మిట్‌లో తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినా చాలా కాలం దేశంలో బానిస మనస్తత్వం పోలేదని విమర్శించారు. ఇప్పుడు తన శక్తి ఏంటో తెలుసుకొని దాని నుంచి బయటపడి అగ్రరాజ్యాలతో ట్రేడ్ డీల్స్ చేసుకునే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ జరుపుకోవడం చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.

News February 27, 2026

రివార్డ్ పాలసీ రూ.కోటి ఇవ్వండి: దేవ్ జీ

image

TG ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందని లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ దేవ్ జీ అన్నారు. ఇవాళ CMతో భేటీ తర్వాత మాట్లాడారు. ‘రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరాం. ఐదెకరాల భూమి ఇవ్వడం సాధ్యం కాదని CM అన్నారు. ఇల్లు, ఉద్యోగం, జీవన భృతిపై హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే జైళ్లలో మావోయిస్టులను కలుస్తాం. అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తాం. తుపాకీ సిద్ధాంతం నడవదని వివరిస్తాం’ అని దేవ్ జీ తెలిపారు.