News December 24, 2025
రాఘవపూర్ పల్లె దవాఖానలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతురావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌హెచ్‌పీ సరిత, ఆశా కార్యకర్తకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News February 19, 2026
మే తొలి వారంలో కవిత కొత్త పార్టీ!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకొని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని ఆమె పేర్కొన్నారు. మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండోది బోధన్ అని చెప్పారు.
News February 19, 2026
పంటల్లో చెదపురుగుల నివారణకు మరికొన్ని సూచనలు

పొలం గట్లపై ఉండే చెదపురుగుల స్థావరాలను గుర్తించి నాశనం చేయాలి. సరిగా కుళ్లని సేంద్రియ ఎరువు చెదపురుగులను ఆకర్షిస్తుంది. అందుకే బాగా కుళ్లిన సేంద్రియ పదార్థాన్నే ఎరువుగా వాడాలి. పంట విత్తేసమయంలో KG విత్తనానికి క్లోరిపైరిఫాస్ 6ml కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలను చెద నుంచి కాపాడవచ్చు. చెరకు పంటలో చెదల నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2mlను కలిపి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత మొక్క మొదల్లో వేయాలి.
News February 19, 2026
ధ్యానంతో దైవ దర్శనం సాధ్యమని చెప్పిన మహర్షి

ఉపనిషత్తుల్లో పేర్కొన్నవారిలో ఆరుణి మహర్షి ఒకరు. ఆయన గొప్ప జ్ఞాని. ఆయన బోధనలు బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో కనిపిస్తాయి. ఆయన ఆధ్యాత్మిక గురువు. ఈయన వద్దే సుప్రసిద్ధ యాజ్ఞవల్క్య మహర్షి విద్యను అభ్యసించారు. ఆత్మ, శరీరం, అంతరాత్మతో దేవుడిని తెలుసుకోవచ్చని శిష్యులకు వివరించేవారు. తన కుమారుడైన శ్వేతకేతువుకు తత్త్వమసి వంటి ఆధ్యాత్మిక రహస్యాలను బోధించి, ధ్యానంతో దైవదర్శనం కలిగించారు.


