News November 28, 2025

రాచకొండలో 110 మంది ఈవ్‌టీజర్ల అరెస్ట్

image

రాచకొండ పోలీసులు మహిళల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో నవంబర్ 1 నుంచి 15 వరకు 110 మంది ఈవ్‌టీజర్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ వేధింపులు 34, సోషల్ మీడియా వేధింపులు 48, ప్రత్యక్ష వేధింపుల ఫిర్యాదులు 53 నమోదయ్యాయి. 7,481 మందికి మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. ఫిర్యాదుల కోసం 8712662111 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Similar News

News November 28, 2025

కొత్తగూడెం: నేర సమీక్ష జరిపిన ఎస్పీ రోహిత్ రాజు

image

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఓటర్లను నగదు, మద్యం వంటి వాటితో ప్రలోభ పెట్టేవారిపై పటిష్టమైన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.

News November 28, 2025

NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

image

NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పంపిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఆమోదించి, నిధులను అమరావతి అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డిఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

News November 28, 2025

శ్రీశైలంలో డిసెంబర్-1 నుంచి ఉచిత లడ్డూ కౌంటర్.!

image

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ ఛైర్మన్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి రూ.500, రూ.300 టికెట్ పొందిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. అలాగే నూతన డొనేషన్ కౌంటర్, కైలాస కంకణముల కౌంటర్, ధర్మకర్తల మండలి చాంబర్ ప్రారంభించటంతోపాటు శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.