News April 2, 2025

రాచకొండ కమిషనరేట్లో ఏప్రిల్ 4న బహిరంగ వేలం..!

image

అంబర్‌పేటలోని CAR పరేడ్ గ్రౌండ్, హెడ్ క్వార్టర్స్ వద్ద కాలం చెల్లిన, పనికిరాని వాహనాల బహిరంగ వేలం రాచకొండ కమిషనరేట్ నిర్వహించనుంది. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ట్రాఫిక్ సామగ్రి, IT & కమ్యూనికేషన్స్ బ్యాటరీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్, ప్రింటర్లు ఏప్రిల్ 4 ఉదయం 10:30 గంటలకు విక్రయించనున్నారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు, ముందుగా అనుమతి తీసుకుని వస్తువులను పరిశీలించవచ్చన్నారు.

Similar News

News April 3, 2025

సుంకేసుల డ్యామ్‌ ఘటన.. మృతులు వీరే!

image

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్‌ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్‌ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్‌ (13), ఫైజాన్‌ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు

image

వక్ఫ్ సవరణ బిల్లు 12 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. నేడు చర్చ, ఆమోదం కోసం బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం ఉండడంతో పాస్ అవ్వడం లాంఛనమే. ముస్లిం సంఘాలు, విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా కేంద్రం వెనక్కి తగ్గలేదు. ట్రిపుల్ తలాఖ్‌ రద్దు, సిటిజన్‌షిప్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్ విషయాల్లోనూ విమర్శలు వచ్చినా ముందుకు సాగింది.

error: Content is protected !!