News January 30, 2025
రాచకొండ కమిషనరేట్‌లో గాంధీజీకి నివాళి

HYD: మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్మెట్‌లోని రాచకొండ కమిషనరేట్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది రెండు నిమిషాల శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శాంతియుత మార్గంలో ఎన్నో పోరాటాలు జరిపి దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై నడిపి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు.
Similar News
News November 9, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రేపు EVMల డిస్ట్రిబ్యూషన్

11న జరిగే జూబ్లీహిల్స్ బైపోల్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. ఉ.7 గం. నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ‘10న సా. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం నుంచి EVM డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 4 EVM మెషీన్లకు 3 అంచెల భద్రత ఉంటుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 45, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ 45, వీడియో టీమ్స్ 8, అకౌంటింగ్ టీమ్‌లు 2 ఉంటాయి’ అని ఆయన వెల్లడించారు.
News November 9, 2025
ట్యాంక్‌బండ్ బుద్ధ విగ్రహం వద్ద థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.
News November 9, 2025
జూబ్లీహిల్స్‌లో అంతా గప్‌చుప్..!

దాదాపు నెలరోజులుగా స్పీకర్ సౌండ్‌లు, ఓటర్లతో మీటింగ్‌లు, హామీలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హోరెత్తింది. ఇవాళ ముగింపు ప్రచారంలో 3 ప్రధాన పార్టీల నేతలు చెలరేగిపోయారు. కాగా ఎలక్షన్‌కు 48గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధనతో అంతా గప్‌చుప్ అయింది. ఇక గప్‌చుప్‌గా లోకల్ నేతల హవా నడువనుంది. నోట్ల పంపిణీ, ఓటర్లను మచ్చిక చేసుకోవడం అంతా వీరి చేతుల్లోనే ఉంటుందిక. మళ్లీ సంబరాలు రిజల్ట్స్ డే రోజే ఇక.


