News October 29, 2025
రాచకొండ: AR కానిస్టేబుల్ చరణ్ మృతి

రాచకొండ ఏఆర్ కానిస్టేబుల్ V.చరణ్ కుమార్ (34)మృతి చెందారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిప్యూటేషన్‌లో ఉన్న ఆయన ఇటీవల ముంబై ఆపరేషన్ నుంచి తిరిగి వస్తూ గాయపడ్డారు. గాయం మానకపోవడంతో యశోద ఆసుపత్రిలో రెండుసార్లు చికిత్స చేయించుకున్నాడు. అనంతరం డిశ్చార్జ్ అయ్యిన కొద్ది సేపటికే ఇంట్లో మూర్ఛతో చనిపోయారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు యశోద ఆసుపత్రిలో ఆయనకు నివాళులర్పించారు. చరణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మరి ఎమ్మెల్సీ ఎప్పుడు?

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన MLA/MLC కాదు. ఈ రెండూ కాకపోయినా మంత్రివర్గంలో చేరవచ్చు. 6 నెలల్లోపు ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సిందే. గవర్నర్ కోటా MLCలుగా అజహరుద్దీన్, కోదండరామ్ పేర్లను ప్రభుత్వం 2నెలల కిందట సిఫారసు చేయగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News October 30, 2025
నల్గొండ: నేలరాలిన ఆశలు

ఆరుగాలం కష్టపడ్డారు. పంటలు బాగానే పండాయి. ఇంకేం శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందని రేపు ధీమాగా ఉండొచ్చని రైతులు కన్న కలలను మొంథా తుఫాన్ కల్లలు చేసింది. వారి ముఖాల్లో నవ్వును చెరిపేస్తూ తీరని దు:ఖాన్ని మిగిల్చింది. అపార నష్టాల్ని కలిగించి అన్నదాతను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతీ మండలంలో దాదాపు ఇదే పరిస్థితి. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు.
News October 30, 2025
జగిత్యాల: 9, 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

జగిత్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు 2025- 26 సంవత్సరానికిగాను స్కాలర్షిప్ కోసం http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ అధికారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాద్యాయులు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న కాపీ, కులం, ఆదాయం, విద్యార్థి బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌లను సమర్పించాలన్నారు.


