News April 7, 2025
రాచువారిపల్లెలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

పుట్టపర్తి మండలంలోని రాచువారి పల్లి గ్రామ సమీపంలో విద్యుత్ షాక్‌తో రైతు నంబూరి ప్రసాద్ మృతి చెందాడు. సోమవారం గ్రామ సమీపంలోని తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. నియంత్రిక వద్ద ఫీజు ఎగిరిపోవడంతో దానిని వేయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ కావడంతో అక్కడికక్కడే మృతి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు.
Similar News
News November 5, 2025
సినిమా అప్డేట్స్

* తాను నటిస్తోన్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కోసం హీరో నవీన్ పొలిశెట్టి ఓ పాట పాడారు. దీన్ని ఈ నెల మూడో వారంలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం JAN 14న విడుదల కానుంది.
* సుధా కొంగర డైరెక్షన్‌లో శివకార్తికేయన్ నటిస్తోన్న ‘పరాశక్తి’ నుంచి ఫస్ట్ సింగిల్ రేపు రిలీజవనుంది.
* తాను రీఎంట్రీ ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిరాధారమని, ఎలాంటి చిత్రాలనూ నిర్మించడం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.
News November 5, 2025
APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News November 5, 2025
గొల్లప్రోలు: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి జైలు శిక్ష

గొల్లప్రోలుకు చెందిన మచ్చ రామ్మోహన్‌కు పోక్సో కోర్టు జడ్జి కె. శ్రీదేవి జైలు శిక్ష, జరిమానా విధించారు. 2017లో 17 ఏళ్ల అమ్మాయిని కళాశాల నుంచి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనపై నమోదు అయిన కేసులో 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారని సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. వాదనలు, ప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.


