News August 20, 2025

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని వినతులు

image

రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ఆ ప్రాంతానికి చెందిన పలువురు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కి మంగళవారం సాయంత్రం వినతి పత్రాలు సమర్పించారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ఎందుకు చేయాలి, ఉన్న వనరులు.. ఇలా పలు విశ్లేషణలతో కూడిన సమాచారాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించారు. తాళ్ళపాక అన్నమయ్య జన్మించిన ప్రాంతంలోనే అన్నమయ్య జిల్లా కేంద్రం ఉండాలని వారు కోరారు.

Similar News

News March 7, 2026

జగిత్యాల: ఇంటర్ పరీక్షలకు 97.95% హాజరు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఎనిమిదో రోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 30 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు జనరల్ కోర్సుల్లో 4,193 మందిలో 4,138 మంది హాజరై 55 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 847 మందిలో 809 మంది హాజరై 38 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 97.95% హాజరు నమోదైంది. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత జగిత్యా ప్రైవేట్ జూనియర్ కళాశాలను సందర్శించారు.

News March 7, 2026

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.. APCRDAతో పూర్తైన ఒప్పందం

image

అమరావతిలో 55 ఎకరాలలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్(IIULER) ఏర్పాటు చేసేందుకు APCRDAతో శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి అశోక్ పాండేకు CRDA ఎస్టేట్స్ విభాగ అధికారి జుబిన్ రాయ్ సంబంధిత పత్రాలు అందజేశారు. క్యాంపస్ ఏర్పాటుకై తోలి దశలో రూ.300 కోట్ల పెట్టుబడి పెడతామని, న్యాయవిద్యకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని IIULER వర్గాలు తెలిపాయి.

News March 7, 2026

జగిత్యాల: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి’

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలుపై కరీంనగర్ కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలో కార్యక్రమం అమలుకు తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికను వివరించారు.