News July 30, 2024
రాజంపేటలో ఘరానా మోసం

పట్టణంలోని ఉస్మాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన అకౌంట్‌లో రూ.1500 డిపాజిట్ చేస్తే రూ.1లక్ష ఇస్తామని చెప్పడంతో నమ్మి పలువురు మోసపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు నమ్మిన పలువురు రూ.7500 డిపాజిట్ చేశారు. అనంతరం మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిపారు. తాము మోసపోయామని బాధిత మహిళలు విలేకర్ల ఎదుట వాపోయారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.
Similar News
News November 4, 2025
రేపు కడపకు రానున్న AR రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.
News November 4, 2025
కమలాపురం: హత్య కేసులో నిందితునికి రిమాండ్ విధింపు

కమలాపురం మండలం అప్పారావు పల్లెలో జరిగిన హత్య కేసులో నిందితుడిని సోమవారం పోలీసుల అరెస్టు చేశారు. సీఐ రోషన్ వివరాలు.. ‘చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు అన్నదమ్ములు. విశ్వనాథరెడ్డి మద్యానికి అలవాటుపడి చెన్నారెడ్డి ఆస్తిలో కొంత ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఇందుకు తమ్ముడు ఒప్పుకోకుండా విశ్వనాథ్ రెడ్డిని బలంగా కొట్టడంతో చనిపోయాడు’. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.
News November 4, 2025
ఒంటిమిట్టలో త్వరలో నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో త్వరలోనే నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభించనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన నిత్య అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రదేశాన్ని పరిశీలించారు. తాత్కాలిక ప్రమాద రహిత జర్మన్ షెడ్లతో నిత్య అన్న ప్రసాద కేంద్రం ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.


