News August 22, 2025
రాజంపేట: అయ్యో పాపం..!

ఆ 8మంది సరదాగా ఈతకు వెళ్లారు. సంతోషంగా గడుపుతున్న వేళ ప్రమాదం దరి చేరింది. కళ్ల ముందే స్నేహితులు నీటిలో మునిగిపోయారు. ఒకదాని తర్వాత మరొక మృతదేహాలను వెలికి తీసి ఒడ్డున వేస్తుంటే ఆపుకోలేని దుఃఖంతో కుమిలిపోయారు. ఎదిగొచ్చిన బిడ్డలు విగతజీవులుగా మారిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బోరున విలపించారు. చెయ్యేరు నదిలో ముగ్గురు విద్యార్థుల <<17476364>>మృతికి <<>>సంబంధించిన విషాద గాథ ఇది.
Similar News
News August 22, 2025
తిరుమల బ్రహ్మోత్సవాలపై సమీక్ష

శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విశ్రాంతి గృహాలు, కాటేజీల్లో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్ల రిపేర్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
News August 22, 2025
సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

TG: కూకట్‌పల్లిలో సహస్ర మర్డర్ <<17484838>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అది సహస్ర చూడగా వెంట తెచ్చుకున్న కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. చోరీ ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అని పేపర్‌లో ముందే రాసుకున్నాడు. స్థానికుడైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సమాచారంతో పోలీసులు బాలుడిని ప్రశ్నించగా విషయం బయటపడింది. లెటర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
News August 22, 2025
Dream 11పై బ్యాన్.. BCCI ఏమందంటే?

కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్ నేపథ్యంలో భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11పైనా బ్యాన్ పడనుంది. దీనిపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. ‘అనుమతి లేకపోతే స్పాన్సర్‌ను తొలగిస్తాం. కేంద్రం తీసుకొచ్చే ఏ పాలసీనైనా తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం అయ్యే ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.