News February 22, 2025

రాజంపేట ఎమ్మెల్యేకు నోటీసులు

image

రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపారు. మందపల్లి, ఆకేపాడు గ్రామాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అక్రమణ ఆరోపణలపై MLA, ఆయన కుటుంబ సభ్యులు నేడు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను, వైసీపీ ప్రభుత్వం హయాంలో దాన విక్రయం కింద బదలాయించుకుని, అందులో ఎస్టేట్ నిర్మించుకున్నారని సుబ్బనరసయ్య ఫిర్యాదు చేశాడు.

Similar News

News July 4, 2025

ములుగు జిల్లాలో నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

image

ములుగు జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నెల రోజుల(4 నుంచి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ శబరీశ్ తెలిపారు. పోలీసు అధికారులకు ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బందులు చేపట్టొద్దన్నారు. వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు బలవంతంగా మూసివేసేందుకు ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 4, 2025

US ఇండిపెండెన్స్ డే.. క్రాకర్స్‌పై $2.8B ఖర్చు?

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికా సిద్ధమైంది. 1776లో ఇదే రోజున బ్రిటిష్ పాలకుల నుంచి ఆ దేశం విముక్తి పొందింది. 249వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అమెరికన్లు సంబరాలు చేసుకోనున్నారు. జాతీయ జెండాలతో అలంకరణలు, పరేడ్‌లు నిర్వహిస్తారు. హాలిడే కావడంతో కుటుంబ సభ్యులంతా ఓ చోటకు చేరుకోనున్నారు. అయితే సెలబ్రేషన్స్ కోసం అమెరికన్లు ఒక్కరోజే $2.8 బిలియన్లు ఖర్చు చేస్తారని నివేదికలు చెబుతున్నాయి.

News July 4, 2025

NZB: రెండు రోజుల పసికందు విక్రయం

image

NZBలో 2 రోజుల పసికందును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గర్భిణి జూన్ 30న ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశివుకు జన్మనించింది. నాగారానికి చెందిన ఓ మధ్యవర్తి సాయంతో పులాంగ్ ప్రాంతానికి చెందిన మరో మహిళకు రూ.2 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదిరింది. ఈ విషయం 1 టౌన్ పోలీసులకు తెలియడంతో తల్లితో పాటు మధ్యవర్తులను విచారిస్తున్నారు.