News December 21, 2025
రాజంపేట: ఎల్లుండి బంద్

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో భాగంగా రైల్వేకోడూరు, రాజంపేటలో మంగళవారం బంద్ పాటించాలని రాజంపేట జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. రాజంపేటలోని R&B భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని షాపులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించాలని కోరారు.
Similar News
News December 21, 2025
పర్ణశాలలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు

దుమ్ముగూడెం: పర్ణశాల రామాలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు హరికథా కాలక్షేపం నిర్వహించగా, సాయంత్రం 4 గంటలకు స్వామివారి తిరువీధి సేవను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
News December 21, 2025
కామారెడ్డి జిల్లా తపస్ అధ్యక్షుడిగా బూనేకర్ సంతోష్

కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బూనేకేర్ సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు తపస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడు రవీంద్రనాథ్ ఆర్య ప్రకటించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై ఉపాధ్యాయులతో కలిసి ఉద్యమిస్తానన్నారు. మాజీ అధ్యక్షుడు రవీందర్ ఉన్నారు.
News December 21, 2025
జగిత్యాల బల్దియాలో నక్షా సర్వే ప్రారంభం

జగిత్యాల బల్దియా పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్షా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సర్వే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా పట్టణ ప్రధాన విభాగాలను సర్వే నిర్వహించారు. 200 ఇళ్లకు ఒక బ్లాక్ చొప్పున పట్టణాన్ని విభజించి, 14 బృందాల ద్వారా GPSతో కచ్చితత్వంతో కూడిన సర్వేను 6 నెలల్లో ఈ సర్వే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.


