News May 22, 2024
రాజంపేట: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అన్నమయ్య జిల్లాలోని మూడు ప్రభుత్వ ఐటీఐలు, 12 ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు జూన్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్, రాజంపేట ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కే. శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని రాజంపేట, పీలేరు, తంబళ్లపల్లె ప్రభుత్వ ఐటీఐలలో 392 సీట్లు, ప్రైవేటు ఐటీఐలలో 1064 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Similar News
News January 24, 2025
కడప: ‘ఆ ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించండి’
కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుంచి తక్షణం తొలగించి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ డిమాండ్ చేశారు. మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డీటీసి చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా కడప ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడటం దారుణమన్నారు.
News January 24, 2025
కడప: మహిళా ఉద్యోగిపై వేధింపులు.. చర్యలు తప్పవు
కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై డీటీసీ చంద్రశేఖర్ వేధింపుల పట్ల అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, జాయింట్ రవాణా కమిషనర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో శుక్రవారం కడప రవాణా శాఖ కార్యాలయంలో స్వయంగా బాధిత మహిళా ఉద్యోగితో మాట్లాడారు. అనంతరం ఘటనపై ప్రత్యేకంగా విచారించారు. కార్యాలయంలోని సీసీ కెమెరాలు స్వయంగా పరిశీలించి డీటీసీ చంద్రశేఖర్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News January 24, 2025
కడప: మహిళా సిబ్బంది పట్ల వేధింపులు.. అధికారిపై వేటు
కడప జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మహిళా ఉద్యోగులకు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిర్లక్ష్యంగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. అతడిపై శాఖ పరమైన విచారణకు ఆదేశించారు.