News October 19, 2025
రాజంపేట: కొద్దిరోజుల్లో పెళ్లి.. అంతలోనే మృతి

మరికొన్ని రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు మృత్యుఒడికి చేరుకున్న విషాదకర సంఘటన శనివారం రాత్రి మాధవరం ప్రాంతంలో జరిగింది. రాజంపేట పట్టణం నూనెవారిపల్లెకు చెందిన శరత్ నాయుడు(29) నేషనల్ హైవే శాఖలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఓ ఎక్స్‌ప్రెస్‌లో రాజంపేటకు వస్తుండగా కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో డోర్ వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
Similar News
News October 19, 2025
దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ రోజున దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని మనం అనాదిగా పాటిస్తున్నాం. నేడు ఇలా దీపాలు వెలిగిస్తే అమ్మవారు మనపై అనుగ్రహం చూపి సంపదలు స్థిరంగా ఉండేలా చేస్తారని నమ్మకం. ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
News October 19, 2025
పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు శుభవార్త

AP: పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు దీపావళి సందర్భంగా శుభవార్త చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలి విడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
News October 19, 2025
MBNR: దీపావళి.. ఎస్పీ కీలక మార్గదర్శకాలు

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పండుగకు కొన్ని కీలక మార్గదర్శకాలు చేశారు. లైసెన్స్ పొందిన విక్రేతల వద్ద మాత్రమే బాణసంచా కొనాలని, బహిరంగ ప్రదేశాలలోనే కాల్చాలని సూచించారు. మండే పదార్థాలకు దూరంగా ఉండాలని, సింథటిక్ కాకుండా కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పటాకులు కాల్చాలని సూచించారు.