News October 28, 2024
రాజంపేట: చికెన్ ముక్క ఇరుక్కుని బాలుడి మృతి

రాజంపేటలో విషాద ఘటన జరిగింది. నంద్యాల జిల్లా సుగాలి తండాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు కూలీ పని నిమిత్తం రాజంపేటకు వలస వచ్చారు. పట్టణంలోని మన్నూరు సాతవీధిలో జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తల్లి ఇంటి పనులు చేసుకుంటుండగా.. సుశాంక్(2) పచ్చి చికెన్ ముక్క నోట్లో వేసుకున్నాడు. ఈక్రమంలో ఊపిరాడక మృతిచెందాడు.
Similar News
News January 6, 2026
2వ సెట్‌ను కూడా కైవసం చేసుకున్న ఏపీ టీం

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్‌లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. రెండో సెట్లోనూ ఏపీ టీం విజయం సాధించింది. <<18778904>>మొదటి<<>> సెట్లోనే విజయం సాధించడంతో 2-0 తో ముందంజలో ఉంది. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.
News January 6, 2026
జమ్మలమడుగు: సెట్ 1 కైవసం చేసుకున్న ఏపీ టీం

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్‌లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. మొదటి సెట్లో ఏపీ విజయం సాధించింది. ప్రస్తుతం రెండో సెట్ జరుగుతోంది. రెండో సెట్‌లోనూ భారీ వ్యత్యాసంతో ఏపీ టీం దూసుకుపోతోంది. మొత్తం 5 సెట్లు జరుగుతాయి. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.
News January 6, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,160
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,027
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.


