News August 16, 2024

రాజంపేట: డెంగ్యూ జ్వరంతో వివాహిత మృతి

image

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం హస్తవరం గ్రామానికి చెందిన రత్నమ్మ (38) డెంగ్యూ జ్వరంతో శుక్రవారం మృతి చెందింది. మూడు రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో రాజంపేట, తిరుపతి లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ జ్వరం తగ్గలేదని, శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందిందని వారు తెలిపారు. రాజంపేట ప్రాంతంలో ఇటీవల డెంగ్యూ జ్వరం భారీన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని పలువురు అన్నారు.

Similar News

News July 9, 2025

కడప: మెరిట్ ఆధారంగా నేరుగా అడ్మిషన్లు

image

కడపలోని డా. వై‌ఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి బి.డిజైన్, బి.ఎఫ్.ఎ కోర్సులలో మెరిట్ ఆధారిత డైరెక్ట్ అడ్మిషన్లకు ఏపీఎస్ఎచ్ఈ అనుమతి లభించిందని వీసీ ప్రొఫెసర్ జి. విశ్వనాథ్ కుమార్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 9, 2025

ముద్దనూరులో యాక్సిడెంట్

image

ముద్దనూరులోని కొత్తపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది. రాజంపేట నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న బొలేరో క్యాంపర్ మినీ లారీ ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. దీంతో బొలేరోలో ఉన్న రజాక్, గోవిందమ్మ, శివమ్మ, మరొకరికి గాయాలయ్యాయి. వారిని ముద్దనూరు 108 వాహన సిబ్బంది సుబ్రహ్మణ్యం ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

News July 9, 2025

Y.S జగన్‌కు మరో పదవి

image

సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ఛైర్మన్‌గా పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డిని నియమించారు. ఛైర్మన్‌గా బండి రామసూరరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా వి.ఓబులేసును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.