News March 20, 2024
రాజంపేట: వృద్ధుడు కనిపించడం లేదని ఫిర్యాదు

చిట్వేల్ మండలం దొగ్గలపాడుకు చెందిన కొండ్రెడ్డి నర్సింహా రెడ్డి (56) కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందిందని రాజంపేట పట్టణ ఎస్సై తెలిపారు. ఈ నెల 13 నుంచి వృద్ధుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తెల్ల రంగు పంచ, చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 91211 00570కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.
Similar News
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా: SP

కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేశ్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా: SP

కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
News March 31, 2025
కడప పోలీస్ కార్యాలయంలో ఉగాది వేడుకలు.!

నిత్యం విధి నిర్వహణలో బిజీబిజీగా గడిపే పోలీసులు ఒక్కసారిగా పంచకట్టులో ఆకట్టుకున్నారు. తెలుగు నూతన సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజు అదివారం కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు ఇతర అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎస్పీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.