News September 26, 2025
రాజంపేట MP మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?

రాజంపేట MP మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈనెల 29న తీర్పు వెల్లడిస్తామని ACB కోర్టు పేర్కొంది. ‘లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కింగ్ పిన్. ఆయన కంపెనీల్లో రూ.5కోట్ల ట్రాన్సాక్షన్లపై అనుమానం ఉంది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’ అని AG దమ్మాలపాటి శ్రీనివాసులు వాదించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా MPపై కేసు పెట్టారని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
Similar News
News September 26, 2025
చిత్తూరు జిల్లాలో వర్కర్లకు వేతనాలు పెంపు

జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న NMR, మజ్దూర్ వర్కర్లకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనాలు పెంచుతున్నట్టు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 16న నిర్వహించిన కనీస వేతనాల పెంపునకు సంబంధించి కమిటీ సభ్యుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరల పెరుగుదల వ్యత్యాసాన్ని అనుసరించి వేతనాలను పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు.
News September 26, 2025
చిత్తూరులో రేపు 2K రన్

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి మెసానికల్ గ్రౌండ్ వరకు 2K రన్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. వ్యాసరచన, వకృత్వపు పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు బాధ్యతలు కేటాయించామన్నారు.
News September 26, 2025
ధనలక్ష్మి అవతారంలో బోయకొండ గంగమ్మ

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి వేద పండితులచే ఆశీర్వచనం కల్పించారు. వివిధ ప్రాంతాల అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.