News January 28, 2026

‘రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం’.. పవార్ మృతిపై రాజ్ ఠాక్రే

image

అజిత్ పవార్ మృతిపై MNS చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన కామెంట్లు చేశారు. రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇది తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. ‘అజిత్ ముక్కుసూటిగా ఉంటారు. హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన శైలి కాదు. దీని వల్ల తను ఎంత మూల్యం చెల్లించుకున్నారో ఊహించుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. అటు <<18982388>>విమాన ప్రమాదంపై<<>> మమతాబెనర్జీ అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే.

Similar News

News February 18, 2026

మోడల్‌తో ఇషాన్ కిషన్ పెళ్లి? తల్లి ఏమన్నారంటే

image

మోడల్ అదితి హుందియాను క్రికెటర్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారాన్ని ఆయన తల్లి సుచిత్రా దేవి ఖండించారు. ‘ఇది ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయం. పెళ్లి గురించి ఆలోచించేంత వయసు ఇషాన్‌కి ఇంకా రాలేదు’ అని పేర్కొన్నారు. కాగా అదితిని ఇషాన్ ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటే అభ్యంతరం లేదని ఇటీవల ఇషాన్ తాత <<19147364>>వ్యాఖ్యానించిన<<>> విషయం తెలిసిందే. ఆయన ఎగ్జైట్‌మెంట్‌లో అలా అన్నారని దేవి వివరించారు.

News February 18, 2026

మదనపల్లె హత్యాచార ఘటన.. నిందితుడి తల్లి పాత్ర ఉందని ఆరోపణ!

image

AP: మదనపల్లెలో బాలికపై <<19173027>>హత్యాచారం<<>> వెనుక నిందితుడు కులవర్ధన్ తల్లి పాత్ర కూడా ఉందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. కులవర్ధన్‌కు మద్దతుగా కొందరు తమపై దాడి చేసేందుకు వచ్చారని, ఆ గ్యాంగ్‌ను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. వారంతా గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నారన్నారు. కులవర్ధన్ గతంలో వీధిలోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించారు.

News February 18, 2026

ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత

image

AP: విశాఖ AUలో ఉద్రిక్తత నెలకొంది. SFIకి వ్యతిరేకంగా ABVP కార్యకర్తలు నినాదాలు చేస్తూ VC ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే టైమ్‌లో SFI నేతలు అక్కడికి వచ్చి ప్రతినినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు రాకుండా మెయిన్ గేటుకు తాళాలు వేశారు. AUలో నిన్న RSS మార్చ్‌ను SFI అడ్డుకున్న నేపథ్యంలో వివాదం ఏర్పడింది.