News December 29, 2024
రాజకీయాల్లో పలకరింపులు సహజం: బొత్స
రాజకీయాల్లో పలకరింపులు సహజమని బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి కొండపల్లి తన కాళ్ళకు నమస్కారం చేశారనే ఆరోపణలపై బొత్స స్పందించారు. లోకేశ్ తనకి షేక్ హ్యాండ్ ఇచ్చారని, పవన్ కళ్యాణ్‌కు ఎదురుగా వెళ్లి కలిశారని.. అవన్నీ సహజమన్నారు. ఎయిర్ పోర్టులో బండారు, పల్లా, కలిశెట్టి కలిశారని అందులో తప్పేముందన్నారు. ఎవరైతే క్రియేట్ చేసుకొని కొండపల్లిపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారో వారే సమాధానం చెప్పాలన్నారు.
Similar News
News December 31, 2024
ఆ కేసులు సత్వరమే పరిష్కారం కావాలి: మంత్రి కొండపల్లి
ఎస్.సి, ఎస్.టి అత్యాచారాలపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కారం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందని తెలిపారు. వారి రక్షణకు రూపొందించిన చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
News December 30, 2024
VZM: తొలిరోజు 279 మంది అభ్యర్థులు గైర్హాజరు
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 321 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. తొలి రోజు 279 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ తెలిపారు. కాగా వేకువజామున నాలుగు గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.
News December 30, 2024
అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై కనిపించకూడదు: ఎస్పీ
నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రశాంతయుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనానిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 31 రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదన్నారు. రాత్రి 1 గంట దాటిన తర్వాత రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.