News January 7, 2026
రాజకీయ ఉనికి కోసం గంటా పోరాటం(1/2)

భీమిలి MLA గంటా శ్రీనివాసరావు రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారా? అనే చర్చ లోకల్‌గా నడుస్తోంది. గతంలో TDP ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే 2019-24 YCP హయాంలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనను చీపురుపల్లికి పంపాలని అధిష్ఠానం భావించింది. చివరకు భీమిలి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గంటా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు.
Similar News
News January 8, 2026
‘నూతన సమీకృత కలెక్టర్ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి’

నూతన సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు జరిగిన పనులను స్వయంగా ఆయన గురువారం పరిశీలించారు. ఇంత వరకు పూర్తికాని నిర్మాణాల గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుగుణాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తి కట్టడాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
News January 8, 2026
YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

AP: రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. అమరావతిపై <<18799615>>జగన్<<>> చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే చర్చ మొదలైంది. గతంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనను ఈసారి అమలు చేస్తారనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వం మారితే APకి రాజధాని మారుతుందా?, శాశ్వత క్యాపిటల్ ఉండదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News January 8, 2026
సర్ఫరాజ్ రికార్డు.. 15 బాల్స్‌లో 50

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ VHTలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశారు. పంజాబ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆయన 15బాల్స్‌లో 50 రన్స్ చేసి చరిత్ర సృష్టించారు. దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ (62) అభిషేక్ శర్మ వేసిన ఒకే ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4 బాది 30 పరుగులు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఓడింది. ఇంతకుముందు ఈ రికార్డు బరోడా బ్యాటర్ అతీత్ శేఠ్ (16 బాల్స్‌లో 50) పేరున ఉంది.


