News April 28, 2024

రాజకీయ ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి

image

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుమతి లేకుండా వాహనాలను
ప్రచారానికి వినియోగించారదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి M. హరి నారాయణన్ తెలిపారు.  ఆయన మాట్లాడుతూ.. అనుమతి పొందిన వాహనాలు అనుమతి పత్రం( పర్మిషన్) వాహనం ముందు భాగంలో అతికించాలన్నారు . FST/SST టీమ్ లు ప్రచార వాహనాలకు అనుమతులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామన్నారు.

Similar News

News February 28, 2026

అల్లు అర్జున్ ఫాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సనత్

image

నెల్లూరు జిల్లా అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఏ.సనత్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పి.సాయి కుమార్ పేర్లును రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ ప్రటించారు. వీరితో 10మంది సభ్యులుగా నియమించారు.

News February 28, 2026

గూడూరు: శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సూసైడ్.. కారణం ఇదే!

image

గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బూదురు సునీల్ కుమార్ <<19259093>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. పొదలకూరులోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకు శ్రీచైతన్య స్కూల్ ఏజీఎం నర్ర శ్రీకాంత్ వేధింపులే కారణం. నా పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదివించాలన్నదే నా చివరి కోరిక’ అంటూ ఆయన సూసైడ్ లెటర్ రాశారు.

News February 28, 2026

నెల్లూరు: ప్రతి ఒక్కరికీ 125 పనిదినాలు

image

వీబీ జీ రాంజీ చట్టంపై మార్చి 27వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డ్వామా పీడీ గంగాభవాని తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. నూతన చట్టం ప్రకారం 125 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. గ్రామసభల్లో వివిధ అంశాలపై ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని ఆదేశించారు.