News November 18, 2024
రాజకీయ లబ్ధి కోసమే YCPపై ఆరోపణలు: బొత్స
AP: వైసీపీ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. శాంతిభద్రతలపై Dy.CM పవన్ ఆందోళన వ్యక్తం చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనిత వ్యాఖ్యలకు తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు దమ్ము, ధైర్యం అంటూ మంత్రి మాట్లాడటం సరికాదని మండలి ఛైర్మన్ మోషన్ రాజు అన్నారు.
Similar News
News November 18, 2024
నేను భారతీయులకు గులాంను: కిషన్ రెడ్డి
TG: తనను గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని, తాను భారతీయులకు గులాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటలీకి, నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులామ్‌ను కాదని దుయ్యబట్టారు. అదానీ పేరు చెప్పి కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం అదానీతో రేవంత్ చర్చలు జరపడం లేదా అని ప్రశ్నించారు.
News November 18, 2024
అంగన్‌వాడీలకు గ్రాట్యుటీపై పరిశీలన: మంత్రి సంధ్యారాణి
AP: అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని వెల్లడించారు. వారికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు. వారి సమ్మె వల్ల గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో వారు ఆందోళనలను విరమించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
News November 18, 2024
సీఎం ఏక్‌నాథ్ శిండే కీలక ప్రకటన
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిండే కీలక ప్రకటన చేశారు. మహాయుతి కూటమిలో సీఎం పదవికి ఎలాంటి రేస్ లేదని స్పష్టం చేశారు. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. మహాయుతి కూటమి విజయం సాధిస్తే బీజేపీ నేతకే సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్టు శిండే వ్యాఖ్యలతో స్పష్టమైంది. అజిత్ పవార్‌కు మరోసారి నిరాశ తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.