News December 9, 2025
రాజధానిలో గ్రామకంఠాల సర్వే.. 13 బృందాలు రంగంలోకి

రాజధాని 29 గ్రామాల్లో గ్రామకంఠాల గందరగోళానికి చెక్ పెట్టేందుకు CRDA 13 సర్వే బృందాలను రంగంలోకి దించింది.
రైతులు మినహాయింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రతి బృందంలో వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చి త్వరలో గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తారు. నివేదికలు అందిన తర్వాత మినహాయింపులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Similar News
News December 12, 2025
విజయవాడ: పుణ్యానికి ధర.. అక్కడ ఇదే వ్యాపారం.!

విజయవాడ కనకదుర్గ ఆలయానికి భవానీ మాల విరమణకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అయితే, ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టేందుకు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టి, తీర్థం ఇచ్చి వెంటనే ‘అమ్మవారి కానుక’ అంటూ డబ్బులు అడగడంపై భక్తులు ఆశ్చర్యపోతున్నారు. పుణ్యం కోసం కొబ్బరికాయ కొట్టాలనుకుంటే, దానికి డబ్బులు తీసుకోవడం ఏంటని నివ్వెరపోతున్నారు.
News December 12, 2025
MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
ములుగు జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 48 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 78.65 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.


